"శాంతి ఆంధ్రప్రదేశ్ ఉద్యమం "
మీకు తెలుసు గా మనరాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలు , నిన్న ఒక విద్యార్ధి ఆత్మాహుతి చేసుకున్నాడు ప్రత్యెక తెలంగాణా కోసం ,మళ్లీ ఊపు అందుకుంది తెలంగాణా ఉద్యమం
రేపు ఒక సారి కనుక కేంద్రం తెలంగాణా కు అనుకూలం గా ప్రకటన చేస్తే ఆంధ్ర నుండి ఆత్మాహుతి ,ధర్నాలు జరుగుతాయ్ , కేంద్రం ప్రకటన చేయకపోతే , తెలంగాణా లో అత్మహుతులు , ధర్నాలు జరుగుతాయ్
ఇది అంతులేని కధ లాగా జరగటమేనా?ఆంధ్ర లో అయిన, తెలంగాణాలో అయిన ఎక్కడైనా ఈ అత్మహుతులు ,ధర్నాలు అవసరమా ?
దీనికి ఒక పరిష్కారం లేదు , తెలంగాణా ఇస్తే కచ్చితం గా ఆంధ్ర లో గొడవలు అవుతాయ్ , ఇవ్వకపోతే కచ్చితం గా తెలంగాణాలో అవుతాయ్ ,
అధిష్టానం అంటున్న తెలంగాణా వాళ్ళు రేపు సమైక్య ఆంధ్ర వైపు అధిష్టానం మొగ్గు చూపితే ఎ గొడవలు చేయకుండా ఉంటారా?
అధిష్టానం అంటున్నసమైక్య ఆంధ్ర వాళ్ళు రేపు అధిష్టానం తెలంగాణా వైపు మొగ్గు చూపితే ఎ గొడవలు చేయకుండా ఉంటారా?
ఇలాంటి పరిస్తితులలో ఆత్మాహుతి చేసుకుంటే తెలంగాణా తేవచ్చు అనో, లేదా సమైక్యంద్ర తేవొచ్చు అనో దయచేసి ఆత్మాహుతి చేసుకోకండి ,
నా ఉద్దేశం లో
తెలంగాణా అడగటం తప్పుకాదు , ఆంధ్ర లో వున్నా కొంతమందికి తెలుసు తెలంగాణా ఎందుకు కావాలో , మిగతా జనాలకి తెలయని వాళ్ళకు 'ఎందుకు తెలంగాణా అడుగుతున్నారు ,ఒక రాజకీయ లబ్ది కోసం తప్పితే 'అనిపించవచ్చు , అందుకే ఉద్యమాన్ని అణగతోక్కుతున్నరేమో
అలాగే సమైక్య ఆంధ్ర అడగటం కూడా తప్పు కాదు , సమైక్య ఆంధ్ర అని ఎందుకు అంటున్నారో, తెలంగాణా కోరుకొనే వారికి తెలియకపోవచ్చు , అందుకే సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని విమర్శిస్తున్నరేమో ,
తెలిసిన వాళ్ళు , తెలియని వాళ్ళని చూసి ' ఆ మాత్రం తెలియదా? ' అనుకోకండి, మనకు వోట్ వేయటం తప్పితే మన MLA విధులు కూడా మనకు తెలియదు ,మన హక్కులు కూడా తెలియదు , మనం వోట్ వేసి ప్రజాస్వామ్యం లో వున్నాం అనుకుంటున్నాం , కాని వోట్ వేసి నియంతల్లాంటి నాయకుల చేతిల్లో వున్నాం,మరి మంచి వాడికే వోట్ వేయొచ్చు కదా అంటారేమో చిన్నప్పటి నుండి చూస్తున్నానా వాడు మంచోదో కాదో తెలుసుకోటానికి , వాగ్దానాలను బట్టే వేయటం అలవాటు చేసుకున్నాం ,ఒక వేళ కొత్త వాడికి వేస్తే వాడు అలానే మరాతున్నాడు . ఆంధ్రలో అయిన , తెలంగాణాలో అయిన, ఉద్యమాలు అంటే మీడియా ముందుకు వస్తున్న నాయకులు , వోట్ వేశాం కదా..ఏమి అబివృద్ది చేసావు ఈ 5 ఏళ్లలో అంటే ...నాయకుడు ఎ ఏరియా వాడైన నేను ఇది చెప్పినదానికన్నా ఎక్కువ చేశాను అనమనండి ..ఒకడు లేదా ఇద్దరు వుంటారేమో , కాని మీడియా ముందు ఈ ఉద్యమాల గురుంచి మాట్లాడేటప్పుడు అందరు అనేది అబివృద్ది . కాదా?
మన భవిష్యత్తు కోసం అంటున్న ఆంధ్ర ,తెలంగాణా , రాయలసీమ నాయకులని అందరిని అడుగుతుంది ఒకటే..మీరు నిజంగా భవిష్యత్తు కోసం అయితే విద్యార్థులను దూరం గా ఉండమని పిలుపునివ్వండి , విద్యార్థులు ఉద్యమాలలో పాల్గొనాలి అని పిలుపు ఇవ్వకండి , వాళ్ళని బలి చేయకండి .
అది నా ఉద్దేశం మాత్రమె ..... మరి ఏమి చేయాలి దీని పరిష్కారానికి ..?
ఈ పరిష్కారాన్ని మనమే చేసుకుందాం ,మాకే(ప్రజలకే) వదిలేయండి , ప్రజాస్వామ్యం కదా,కేవలం మేము ఎన్నుకున్న నాయకుల వాయిస్ మాది అనుకోకండి , గెలిచేవాడు కాదండి కింగ్ , గెలిపించేవాడు కింగ్ అని మీరు మర్చిపోకుండా , election పెట్టండి , ఇక్కడ నాయకులు నుంచొరు వుండరు కూడాను , ఈ election లో కేవలం బాల్లెట్ పేపర్ మీద వుండేది , జై ఆంధ్ర , జై రాయలసీమ , జై తెలంగాణా , జై సమైక్యాంధ్ర ఇవే అబ్యర్దులు గా వుండాలి , మాకు ఏమి కావాలో మేము డిసైడ్ చేస్తాం , మీరు ఉద్యమ నాయకులు గా మీరు మీ ఉద్యమాన్ని promote చేసుకొనే అవకాశాన్ని కూడా ఇస్తాం.అందరికి అర్థం అయ్యేలా, మీరు ఏ ప్రాంతం వాళ్ళైన అర్థం అయ్యేలా మీ సమస్యలను, ఏ నినాదం అయినా ,ఎందుకు అడుగుతున్నారు అని promote చేయండి , చేసుకోండి కూడా , కాని గెలిపించే హక్కు మాకివ్వండి , ఢిల్లీ లో వున్నా అధిష్టానం దగ్గరకు వెళ్ళకండి , మనమే అధిష్టానాన్ని గెలిపిచాం అని మర్చిపోకుండా , మీరు(నాయకులు) కొట్లాడు కోవద్దు , ఎందుకంటే మిమ్మల్ని అబివృద్ది చేస్తారని గెలిపించాం కాని , ఇలా అబివృద్ది జరగని ప్రదేశాలు వుంటే తప్పు మాది కాదండి , తప్పు మీ వైపు వుంది ,అబివృద్ది కాకుండా ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారని మాకు తెలిసివుంటే బాగుండేది ,
కళ్ళు మూసుకొని వున్నా , ఒక సామాన్యుడి గా కళ్ళు ఇంకా తెరవని వాళ్ళు తెరవండి, నిజం గా తెలంగాణా లో, రాయల సీమ లో , ఆంధ్ర లో అభివృద్ధి జరగలేదు అంటే అది మీ నాయకుల తప్పా , కాదా ?
అలాంటి ఒక తప్పు కు మనం అందరం బాద్యులమే , ఎందుకంటే మనమే వోట్ వేశాం కాబట్టి
తెలంగాణా వాళ్ళు,ఆంధ్ర వాళ్ళు సోనియా గాంధీ అనకుండా అందరికి అర్థం అయ్యేలా చెప్పండి సమస్య ఏంటి అని , వదిలేయండి సోనియా గాంధీ ని, ఎందుకంటే మన సమస్య కు మనమే బాద్యత వహిద్దాం, సోనియా గాంధీ ని మెప్పించే ప్రయత్నం కన్నా , అందరిని మెప్పించండి ,సోనియా గాంధీ ని మీప్పించాలి, సమస్య సోనియా గాంధీ కి అర్థం అయ్యేలా చెప్పాలి అని కాకుండా మాకు అర్థం అయ్యేలా చెప్పండి , ఢిల్లీ లో సోనియా గాంధీ ఇవ్వాళా ఉండొచ్చు , రేపు ఇంకొకరు ఉండొచ్చు . అన్ని ఉద్యమ పార్టీ లకు చెప్పేది ఒకటే మాకు అర్థం అయ్యేలా చెప్పండి చాలు , ప్రజాస్వామ్యం అంటే.. మేము గెలిపించుకున్న నాయుకుల చేతి లో అన్ని అధికారాలు వున్నట్లు కాదు , అలా వుంటే అది నియంత ప్రభుత్వమే , అవసరమైతే రాజ్యాంగాన్ని మారుద్దాం , ప్రజలం మమ్మల్ని అర్థం చేసుకోండి
ఉద్యమాలకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళకంటే , ఎందుకు ఉద్యమాలు చేస్తన్నారో తెలియన వాళ్ళే ఎక్కువ , ఎందుకు అంటే మన రాష్ట్ర జనభా లో అన్ని ఉద్యమాలలో కలిపికనీసం సగం మంది కూడా ఉద్యమాలలో పాల్గొనటం లేదు , చెప్పండి ఏ ఉద్యమం అయిన ఆ ప్రాంత ఏరియా లో సగం మది కన్నా తక్కువే వుంది వుంటారు ,రాష్ట్రం లో ఉద్యమం అంటే తెలియని వాళ్ళు ఎక్కువ , వాళ్ళ దగ్గరకు కూడా ఉద్యమం అంటే తీసుకొని వెళ్దాం అది ఏ ఉద్యమం అయినా,అప్పుడు ఒక ఉద్యమం మా దగ్గరకు వచ్చినప్పుడు , మేము కొట్టుకోము , రాజకీయం చేయం , మాకు తెలిసిన న్యాయం చేస్తాం ,
అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి , మమ్మల్ని సమస్య ని పరిష్కారం చేసే దిశ గా encourage చేయండి , ప్రజా ప్రతినిధులు గా మీ నిర్ణయాలు మా మీద రుద్దటం కాదు ,మా ఉద్దేశం కూడాతెలుసుకోండి ,
అది ఏ ఉద్యమం అయినా , సమైక్య ఆంద్ర అంటున్న ఆంధ్ర వాళ్ళైన , తెలంగాణా అంటున్న తెలంగాణా వాదులైన .
ఒక గల్లి నాయకుడు దగ్గర నుండి , ఢిల్లీ నాయకుడు దాక మనమే ఎంచుకుంటున్నాము, ఒక రాష్ట్రం విడిపోవాలా? వద్దా? అనేది కూడా మేమే నిర్ణయిస్తాం వోట్ ద్వారా, సాదారణ elections లో మాకు నచ్చిన వాడు గెలిచినా , నచ్చని వాడు గెలిచినా ఎలా బరిస్తున్నమో, అలాగే రాష్ట్రము విడిపోయిన, విడిపోక పోయిన మేము భరిస్తాం ,
మన సోదరులకు ఒక కష్టం అంటే , మనకు కూడా ఒక కష్టమే, బస్సులు తగల పెట్టటం ద్వారా , అత్మహుతులు ద్వారా భవిష్యత్తు ని కోల్పోతాం, దానికి బదులు గా మన భవిష్యత్తు కోసం చేసే ఉద్యమాలకు solution వెదుకుదాం
ఇదే "శాంతి ఆంధ్రప్రదేశ్ ఉద్యమం " మీరు దీనికి మద్దతు పలికితే ఇంకో 4గురు చేత చదివించండి , ఇది నాకు తోచిన ప్లాన్ మాత్రమే , ఇంతకన్నా మంచి ప్లాన్స్ మీ దగ్గర వుండే వుంటాయ్, మనకు ఎందుకు లే అని కూర్చో వద్దు , మన రాష్ట్రం , మన కుటుంబం లోనే ఒక సమస్య గా పరిష్కరించాల్సిన అవసరం వుంది ,మీ దగ్గర శాంతియుత సమస్య పరిష్కార దిశగా ఒక ప్లాన్ వుంటే నాకు పంపండి ,
{Dont trouble trouble until trouble troubles you}



