Focus

"బాబా" లు బాబోయ్

(0 votes, average 0 out of 5)

నిత్యానంద స్వామి వెలుగులోకి వచ్చాడు కదా నటి రంజిత తో శృంగార కార్యక్రమాలు చేస్తూ ..ఇక టీవీ లో ఒకటే గొడవ బాబాలను నమ్మవద్దు అని..
బాబా శృంగారం చేస్తే మహిమలు పోతాయనా ? ఈ రోజు దొంగ బాబా అంటున్నారు?
మనం ఒకడిని బాబా అంటే బాబా, కాదు అంటే కాదు..అంటే బాబా లను మనమే సృష్టిస్తున్నాం 
అసలు బాబా లను నమ్మాలా? వద్దా?
ఎందుకు నమ్మాలి?మనం బాబా ల దగ్గరకు ఎందుకు వెళ్తాం ,మనకు ఏదైనా సమస్య ఉంటేనే కదా .., మరి బాబాలు మన సమస్యలను తీరుస్తారా? మరి దేవుడు ఎందుకు?
మనం అందరం బాబాల దగ్గరకు ,లేదా దేవుడు దగ్గరకు వెళ్లి  CM అవ్వాలి అని మొక్కుకొందాం  బాబా ని కాని,దేవుడిని కాని ? జరుగుతుందా?అందరం అవుతామా ?
అది మనకి అందరికి తెలుసు..
నిజానికి మనం దేవుడినే నమ్మం ..నమ్ముతున్నాను అనుకుంటాం, కావాలంటే అంత నమ్మకం వుంటే  మీ ఫ్యామిలీ లో  ఎవరికన్నా సీరియస్ హెల్త్ ప్రాబ్లం వస్తే  108 కాల్  కాకుండా తిరుపతి లేదా మీరు నమ్మే గుడి కి  తీసుకెళ్ళండి ?
చిలుకూరి లో అయిన కోరుకున్నా  జరగనవి ఎన్ని ?
అంతెందుకు మన లైఫ్ లో గుడి కి చాల సార్లు వెళ్లి చాలా కోరుకుంటాం ,కోరుకున్న వాటిలో 25 % అన్న జరిగాయాయ , జరిగినవన్నీ కోరుకోబట్టే  జరిగాయా ?
అంటే దేవుడిని కోరుకుంటేనే జరగనివి బాబా లను కోరుకుంటే జరుగుతాయా?
ఇక నిత్యానంద news ఇంకో 2 డేస్ వస్తుందేమో TV లో అంతే  ఆ తరువాత  అన్ని మరిచిపోతం
కాని మనం ఆగుతామా ? ఈ బాబా దొంగ బాబా ఐతే ఇంకో బాబా దగ్గరకు వెళ్తాం , అయన దొంగ బాబా అంటే ఇంకో బాబా ,మనిషి  అన్నాక సమస్యలు ఉంటాయ్, బాబాలు వుంటారు
తిరుపతి లో కోరుకుంటే జరగలేదు అంటే షిరిడీ వెళ్తాం ,షిర్డీ లో జరగకపోతే శ్రీశైలం అంతే కదా
నేను బాబాలను నమ్మొద్దు అనటం లేదు, బాబా లలో ఏది ఆశించకుండా  జనాలకు మేలు చేసే మంచి బాబాలు లేరు అనటం లేదు ,అడగకుండానే ఆపదలు ఆదుకొనే దేవుడు లేడు అనటం లేదు ,మనం కొన్నిటికి అలవాటు పడ్డాం అంటున్నాను అంతే

 
Your Ad Here

Sponsored Links

Subscribe to Telugu News

Enter your email address:

Delivered by FeedBurner

World Markets

Shanghai 2,655.39 -0.38 (-0.01%)
Nikkei 225 9,114.13 +51.29 (0.57%)
Hang Seng Index 20,971.50 +102.58 (0.49%)
TSEC 7,830.21 +109.39 (1.42%)
FTSE 100 5,428.15 +57.11 (1.06%)
DJ EURO STOXX 50 2,746.23 +31.04 (1.14%)
CAC 40 3,672.20 +40.77 (1.12%)
S&P TSX 12,144.92 +33.83 (0.28%)
S&P/ASX 200 4,541.20 0.00 (0.00%)
BSE Sensex 18,221.43 -16.88 (-0.09%)
Powered by News4Trader.com